ఆ హీరో కోసం హాట్‌బ్యూటీల పోటీ


రజనీకాంత్ - కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మూవీ రెడీ అవుతోంది. మే నుంచి సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా రజనీకాంత్ సరసన అనుష్కను హీరోయిన్ గా తీసుకున్నారు. అందుకు సంబంధించి కాల్షీట్లు ఇచ్చేసింది ఈ బ్యూటీ. తాజాగా బాలీవుడ్ అమ్మడు సోనాక్షిసిన్హాను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమెని డైరెక్టర్ సంప్రదించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సోనాక్షి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఆఫీషియల్‌‌గా స్టేట్‌మెంట్ మిగిలివుంది. బాలీవుడ్‌లో ఈ సుందరి రెండుసినిమా చేస్తోంది... ఎలాగలేదన్నా కాల్షీట్లు అడ్జెస్ట్‌మెంట్ చేసుకుని ఇచ్చే అవకాశముందని బాలీవుడ్ టాక్. మొత్తానికి ఇద్దరు హాట్‌బ్యూటీ ‘తలైవార్’ గురించి పోటీపడటం ఖాయమన్నమాట.
 




Tags : Ap cinema, tollywood news, tollywood gossips, Anushka and sonakhsi romance with young hero, rajinikanth hero, rajinikanth latest movie, rajinikanth and ks ravikumar movie,anushka heroine, sonakshi another heroine

Post a Comment

 
Top