ఈసారి చిరంజీవిదే రాజ్యం

             ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో కొట్టుకుపోయింది. ఇది కాదనలేని వాస్తవం. కానీ అదే సమయంలో చిరంజీవి సుడి తిరిగింది. చిరు ఉప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఏకైక రథసారథిగా మిగిలారు. అంతేకాదు.. రానున్న పాలిటిక్స్ లో చక్పం తిప్పే దిశగా ఎదుగుతున్నారు. అసెంబ్లీ, లోక్ సభ స్థానాల కోసం ఓ జాబితాను సిద్ధం చేసింది కాంగ్రెస్ ఎన్నికల కమిటీ. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అధ్యక్షతన తయారైన ఈ జాబితాలో 50శాతానికి పైగా అభ్యర్థులు కొత్తవాళ్లున్నారు. రఘువీరా, బొత్స, చిరు కీలక సభ్యులుగా స్క్రీనింగ్ కమిటీ వీటిలోంచి తుది జాబితాను తయారుచేస్తోంది. సరిగ్గా ఇక్కడే చిరు తన గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు.


    ఈరోజు ఢిల్లీలో అధిష్టానంతో చిరు, రఘువీరా, బొత్స సమావేశం కానున్నారు. దాదాపు సగం సీట్లకు అభ్యర్థుల్ని ఈరోజే ఖరారుచేయనున్నారు. చిరంజీవి చెప్పిన పేర్లనే ఎక్కవగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రఘువీరా, బొత్స కూడా చిరు మాటకు విలువనివ్వడం.. అటు అధిష్టానం కూడా చిరు చెప్పినట్టే చేస్తుండడంతో.. రానున్న ఎన్నికల్లో చిరు ఎవరి పేరు చెబితే వాళ్లే కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో నిలబడనున్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు పార్టీలో కీలకంగా మారారు చిరంజీవి.




Tags : Andhrapradesh, ap political news, Chiranjeevi Plays Key Role, chiranjeevi main seemandhra, chiranjeevi focus seemandhra, chiranjeevi key role in seemandhra, chiranjeevi ticket allocations

Post a Comment

 
Top