పీ ఆర్ పీ ఆఫీసు మళ్లీ తెరిచారోచ్..



       ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఆఫీసు మళ్లీ తెరిచారు.. అదేంటి.. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయింది కదా.. మళ్లీ తెరవడం ఏంటని ఆశ్చర్యపోవద్దు.. నిజంగానే ప్రజారాజ్యం పార్టీ ఆఫీసు తెరిచారు. కాంగ్రెస్ నేత చిరంజీవి అందులో తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ తో రహస్యంగా సమావేశమయ్యారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అయికూర్చుంది.

     పవన్ జనసేన పేరుతో ప్రజల్లోకి చొచ్చుకుపోయాడు. సేమ్ టైం మెగా అభిమానులు రెండుగా చీలిపోయారు. పవన్ వైపు ఎక్కువమంది ఫ్యాన్స్ మొగ్గుచూపారు. అసలు చిరంజీవికి అభిమానులు మిగిలారా అనే సందేహాలు కూడా వచ్చాయి జనసందోహాన్ని చూసి. అందుకే చిరు అత్యంత గోప్యంగా సమావేశం ఏర్పాటుచేశాడు. ప్రజారాజ్యం ఆఫీసులో 13 జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులతో చర్చలు సాగాయి. పవన్ వైపు వెళ్లొద్దని.. తనతోనే ఉండాలి చిరు తన అభిమానుల్ని కోరారు. అంతేకాకుండా.. ఎన్నికల తర్వాత గెలిచినా, గెలవకపోయినా.. అభిమానులందరికీ ఏదో ఒకటి చేస్తానని కూడా మాటిచ్చారట చిరు. మొత్తానికి పవన్, చిరంజీవిలో కదలిక తీసుకొచ్చాడన్నమాట.




Tags : Andhrapradesh, ap political news, Chiranjeevi Reopens PRP office, chiranjeevi union minister, chiranjeevi future plan, Chiranjeevi focus prp party, Chiranjeevi reopen prp, Chiranjeevi met fans, Chiranjeevi secret meeting

Post a Comment

 
Top