ప్రిన్స్‌తో సినిమా చేయదా..?
అనుకున్నదొక్కటి... జరిగింది మరొక్కటి. ప్రిన్స్ మహేష్ సరసన బాలీవుడ్ హాట్ సోనాక్షిసిన్హా నటిస్తోందంటూ కొద్దిరోజుల కిందట జోరుగా వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు అదంతా పుకార్లేనని తేలిపోయింది.
మహేష్ సరసన నటించాలని సోనాక్షి ఆదినుంచి ఇష్టంగానే వుండేది. ఒకానొక దశలో అవకాశమొస్తే నటిస్తానని మనసులోని మాట చెప్పేసింది. మహేష్-నాగార్జున కలయికలో మణిరత్నం మల్టీస్టారర్‌ని తెరకెక్కిస్తున్నవిషయం తెల్సిందే! ఇందులో ప్రిన్స్ సరసన సోనాక్షిని తీసుకోవాలని దర్శకుడు భావించాడు... ఈక్రమంలో ఆమెని సంప్రదించాడు... ఓకే కూడా చెప్పేసింది. అంతా ఓకే అనుకునే సమయంలో కాల్షీట్లు అడ్జెస్ట్‌మెంట్ కాకపోవడంతో చక్కటి అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను ఎంపికయ్యారు. ఒకరు ఐశ్వర్యారాయ్ కాగా... మరొకరు శృతిహాసన్.. మరి మూడో హీరోయిన్ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి. లేకలేక టాప్ డైరెక్టర్ మూవీలో వచ్చిన అవకాశం ఊహించని విధంగా జారిపోవడంతో సోనాక్షి బాగానే అప్‌సెట్ అయ్యిందని ఇండస్ర్టీలో చర్చించుకుంటున్నారు.
Tags : Ap cinema, tollywood news, tollywood gossips, sonakshi sinha rejected mahesh movie, maniratnam director, maniratnam multistarer movie, sonakhsi sinha heroine, sonakshi with mahesh, sonakshi reject, sonakshi callsheet problem
Post a Comment