MovieName:ప్రతినిధి

Casting:  నారా రోహిత్, శుబ్రా అయ్యప్ప , కోట శ్రీనివాస రావు, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి తదితరులు

Music :సాయి కార్తీక్

Director : ప్రశాంత్ మండవ

Producer : సాంబశివరావు

Rating: 3/5
Introduction:  నారా వారి వారసుడిగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ కు బాణం బాగానే ఉందనిపించినా.. సోలో తో తొలి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఫ్లాప్ బాట పట్టాడు. అంతలోనే పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు కి ఎన్నికల సమయం లో హెల్ప్ అవ్వాలని ప్రతినిధి అనే సినిమా తో మన ముందుకు వచ్చాడు. ట్రైలర్ బాగానే ఉందనిపించిన ఈ సినిమా ఎలా ఉంది? అనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశం ఉందా? హీరో గా నారా రోహిత్ కి ఈ సినిమా ఏమైనా హెల్ప్ అవుతుందా? ప్రత్యర్ధులను టార్గెట్ చేసి తీశారంటున్న ఈ సినిమా ఎన్ని వివాదాలను క్రియేట్ చేస్తుంది? చూద్దాం రండి.

Plot: సమాజం లో ఉన్న సమస్యలను ఎత్తి చూపడమే ప్రతినిధి ప్రయత్నం. ఆ ప్రయత్నం నెరవేరడానికి సి.ఎం. ని కిడ్నాప్ చేస్తాడు. జర్నలిస్ట్ అయిన శ్రీను సి.ఎం ను ఎందుకు కిడ్నాప్ చేయవలసి వచ్చింది. ఓట్ల కోసం, పదవి కోసం మనుషులను చంపడానికి కూడా వెనుకాడని రాజకీయ నాయకుల నైజాన్ని ఎలా బయట పెట్టాడు. ఈ ప్రయత్నం లో మంచోడు శ్రీను గర్ల్ ఫ్రెండ్, అండ్ శ్రీను ఫ్రెండ్ అయిన మినిస్టర్ కొడుకు ఎలా సహాయం చేశారు అనేది కథ. డ్రై సబ్జెక్టు ని ఇంటరెస్టింగ్ గా చెప్పటానికి రచయిత చేసిన ప్రయత్నానికి భంగం కలగ కూడదంటే ఇంతకు మించి కథ చెప్పకూడదు.

Performance : నారా రోహిత్ వాయిస్ లో చాలా క్లారిటీ ఉంటుంది. పరిణతి తో కూడిన నటన చూపించాడు. డైలాగ్ డెలివరీ తో ఇంప్రెస్ చేశాడు. కానీ బాడీ ని కంట్రోల్ లో పెట్టుకోవలసిన ఆవశ్యకత ఉంది. శుబ్రా అయ్యప్ప శుద్ధ వేస్ట్. సినిమా కు మైనస్ అయింది. పోసాని కృష్ణ మురళి చాలా ప్లస్ అయ్యాడు. సినిమా క్లిక్ అయిందంటే దానికి మెయిన్ పిల్లర్ పోసాని అనే చెప్పాల్సి ఉంటుంది. శ్రీ విష్ణు కూడా బానే చేశాడు. జయప్రకాశ్ రెడ్డి తో పాటు మిగతా నటులందరూ ఓకే అనిపించారు.

Technical:రైటర్ ఆనంద్ రవి మాక్సిమం ట్రై చేశాడు. కానీ బడ్జెట్ పరిమితులు చాలా ఉన్నట్టు ఉన్నాయి. సీరియల్ కి అవసరమైనంత పెట్టుబడి కూడా లేకుండా సినిమా తీసేశారు. కొన్ని సీన్స్ లో ఇంప్రెస్ చేసినప్పటికీ ఆ బడ్జెట్ పరిమితుల వల్లనేనేమో సి.ఎం. కిడ్నాప్ ఎపిసోడ్ ని మరీ సిల్లీ గా ప్లాన్ చేశారు. తెలుగు ఆడియన్స్ బ్రెయిన్ పైన ఎంత నమ్మకమో. స్క్రీన్ ప్లే పైన బాగానే వర్క్ చేశారు కానీ సరిపోలేదు. ప్రతి సారీ మీడియా ను వాడుకోవలసి వచ్చింది. ఎడిటింగ్ కి కూడా చాలా స్కోప్ ఉంది. స్టొరీ తక్కువ ఉన్నప్పుడు ఇంట లెంగ్త్ అవసరం లేదు. చాలా సార్లు బోర్ కొట్టేసింది. సాయి కార్తీక్ సంగీతం జస్ట్ ఓకే.

Highlights :

నారా రోహిత్,
పోసాని కృష్ణ మురళి
కథను ఇంటరెస్టింగ్ గా చెప్పటం లో కొంతవరకు సక్సెస్ అవడం
 రైటింగ్ వర్క్
Drawbacks :

 హీరో ఇన్ శుబ్రా అయ్యప్ప
 ఎడిటింగ్
  లాజిక్ ని అస్సలు పట్టించుకోక పోవడం


Bottom Line :    ఈ ప్రతినిధి ప్రయత్నం ఫరవాలేదు

Post a Comment

 
Top