మిల్కీ బ్యూటీ తమన్నా మెగా కాంపౌండ్ హీరోల పై విరక్తి పెంచుకుంది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం హరీష్ శంకర్ మెగా కాంపౌండ్ హీరో సాయి ధర్మ తేజ్ తో త్వరలో తీయబోతున్న ఒక సినిమా కోసం తమన్నాను సంప్రదిస్తే మరికొంత కాలం వరకు తాను ఇక ఏ మెగా కుటుంబ హీరోతోను నటించనని తెగేసి చెప్పిందని వార్తలు వస్తున్నాయి. తమన్నా ప్రస్తుతం ప్రిన్స్ తో ‘ఆగడు’, ప్రభాస్ తో ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. కానీ తాజాగా మెగా క్యాంపుకు గుడ్ బై చెప్పే దిశగా తమన్నా తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద కారణం ఉంది అంటున్నారు. నిన్నటి వరకూ ఈ ముద్దుగుమ్మ మెగా హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. అయితే వీటిలో విజయం సాధించినవి తక్కువే. కేవలం రామ్ చరణ్ తో చేసిన ‘రచ్చ’ మాత్రమే హిట్ అందుకుంది. అంతక ముందు అల్లు అర్జున్ తో ‘బద్రీనాథ్’ చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమాకు తమన్నాకు రావలిసిన పారితోషికం కూడా ఇప్పటికి పూర్తి గా తమన్నా కు అందలేదు అని అంటారు. అందుకే మెగా హీరోలపైమిల్కీ బ్యూటీ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మెగా కాంపౌండ్ లో కొత్తగా చేరిన ‘శ్రుతి హాసన్’ మాత్రం మెగా హీరోలు అందరితో నటిస్తూ తమన్నాకు సాధ్యంకాని సూపర్ హిట్స్ కొడుతూ దూసుకు పోతు ఉండటం కూడ తమన్నాకు జెలసీగా మారింది అని అంటారు. అందుకే ప్రస్తుతం మిల్కీ బ్యూటీకి మెగా కుటుంబం పై కోపంగా ఉంది అని అంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment