వెంటాడుతున్న కష్టాలు


రామ్‌చరణ్ ఈ ఏడాది కూడా కష్టాలే ఎదురవుతున్నాయి. పుట్టినరోజు బాబాయ్ పవన్ పార్టీ సభ పెట్టడం మెగా ఫ్యామిలీకి టెన్షన్ పెట్టేసింది. ఈ టెన్షన్ చివరకు మెగా ఫ్యాన్స్ రెండువర్గాలుగా చీలిపోయాయి. చివరకు ఎలాగోలా సద్దుమణిగిందని భావిస్తున్నతరుణంలో... చెర్రీ బర్త్‌డే వేడుకలకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద పెట్టిన ఫెక్సీలు ఈ హీరో మెడకు చుట్టుకున్నాయి. ఎలక్షన్ కోడ్ అమలులోవుండగా వీటిని ఎలా పెడతారంటూ జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హీరోపై కేసు నమోదయ్యింది.
తాజాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రానికి‘గోవిందుడు అందరివాడేలే’టైటిల్‌పై వివాదం నెలకొంది. ఇప్పటికే ఈ పేరును ఫిల్మ్‌ఛాంబర్‌లో ఓ డైరెక్టర్ రిజిస్టర్ చేయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత బండ్ల‌గణేష్... ఆ డైరెక్టర్ ని సంప్రదించి ఆ టైటిల్ తమకు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం ఎలా ముగింపు దశకు వస్తుందో చూడాలి.  చెర్రీ కూడా తన సన్నిహితుల దగ్గర పుట్టినరోజు సమస్యలను వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చెర్రీకి పుట్టినరోజు వేడుకలు కలిసిరానట్లేనని మెగా ఫ్యాన్స్‌లోని ఓ వర్గం భావిస్తోంది. 




Tags : Ap cinema, tollywood news, tollywood gossips,case file against ramcharan, ramcharan birthday flex issue, police register case, ramcharan birthday pawan sabha,devide mega fans groups, ramcharan multistarer movie, govindudu andari vaadele title dispute,govindudu andari vaadele already register another director

Post a Comment

 
Top