ఎంత చక్కటి కనుముక్కు తీరు ఉన్నా మచ్చలు, మెుటిమలు గల చర్మం ఉంటే వారి అందం కొంచెం మసకబారినట్టే ఉంటుంది. ఆరోగ్యవంతమైన చర్మం అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుేక ముఖ చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలి. మెటిమలకు కారణమైన బ్లాక్‌హెడ్స్ వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు అందమైన చర్మం కావాలంటే కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. అవెంటో చూసేద్దమా..
1. మేకప్‌ వేసుకునే అలవాటు ఉన్న వారు జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ను దూరంగా ఉంచడం మంచిది.
2. జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ చర్మ రంధ్రాలలో చిక్కుకుని బ్లాక్‌హెడ్స్‌ అనంతరం మొటిమలు రావడానికి కారణమవుతుంది.
3. ఒకవేళ జిడ్డు చర్మం ఉన్నట్టు అయితే సున్నితమైన క్లెన్సర్‌ను ఉపయోగించడం మంచిది.
4. పదే పదే సబ్బును ఉపయోగించి ముఖం కడగడం కన్నా క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని నీళ్ళతో కడిగేసుకుంటే ముఖం శుభ్రంగా ఉంటుంది. పదే పదే సబ్బును ఉపయోగిస్తే చర్మ కణాలు పాడయ్యే అవకాశముంటుంది.
5. మృత చర్మ కణాలను తొలగించేందుకు ఎక్స్‌ఫోలియేషన్‌ మంచిది. చర్మ రంధ్రాలలో వృద్ధి చెందే మృతకణాలను ఎక్స్‌ఫోలియేట్‌ చేయ డం ద్వారా తొలగిస్తే బ్లాక్‌హెడ్స్‌ సమస్య చాలా వరకూ తీరిపోతుంది.
6. బాగా జిడ్డు చర్మం ఉన్నవారు ఆ జిడ్డును తొలగించుకునేందుకు క్లే మాస్క్‌ ఉపయోగించడం మంచిది. పుదీనా, పిప్పర్‌మెంట్‌ లేదా చికాకు చేసే పదార్ధాలు లేని క్లే మాస్క్‌ను వాడడం మంచిది.
7. నిమ్మరసం, బాదం నూనె, గ్లిసరిన్‌ను సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించుకోవాలి. ఇది బ్లాక్‌హెడ్స్‌ తగ్గేందుకు ఉపకరించడమే కాక ముఖంపై ఉండే ఇతర మచ్చలను కూడా తగ్గిస్తుంది.
8. ప్రతిరోజూ సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళలో ముంచిన బట్టతో ముఖాన్ని తుడుచుకోవడం ఎంతో మంచిది. గోరువెచ్చటి నీళ్ళలో టవల్‌ లేదా నాప్కిన్‌ను ముంచి దానిని పావుగంట పాటు ముఖం మీద ఉంచుకోవడం ద్వారా చర్మ రంధ్రాలలో చిక్కుకుపోయిన మురికి, మృతకణాలు వంటివి బయటకు వచ్చేస్తాయి. అనంతరం ఆ నాప్కిన్‌ను వేడి నీటిలో ఉతకడం మరువకండి.
9. బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉంటే కొంచెం తేనె తీసుకుని దానిని వేడి చేసి అవి ఉన్న ప్రాంతంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగి వేయాలి. ఇది సహజమైన పీల్‌లా ఉపయోగపడి బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోయేందుకు దోహదం చేస్తుంది.

Post a Comment

 
Top