మన శరీరంలో అత్యంత పెద్ద అంగం చర్మం. ఏ అంగానికి వ్యాధులు ఏర్పడినా కాస్త త్వరగా తగ్గుతాయేమోగాని చర్మానికి వ్యాధులోస్తే ఆట్టే తగ్గనే తగ్గవు. అయితే చర్మ వ్యాధుల బారిన పడినప్పుడు వాటిని తగ్గించుకునే దిశగా కొన్ని సహజసిధ్ధమైన నివారణా మార్గాలున్నాయి. అవేంటో చూద్దామా..
1. మినుములు చర్మానికి మంచి ఔషధంగా పని చేస్తాయి. మినుములను నీటితో నూరి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబోల్లి మచ్చలు పోతాయి.
2. కిరోసినాయిల్ చర్మ వ్యాధులకు మచి మందు. ఎంటి కిరోసినాయిలా అనుకుంటున్నారా..అవును ఇది చర్మంపైన కిరోసినాయిల్ మాటిమాటికీ రాస్తే గజ్జి, తామర వంటి చర్మరోగాలు హరించిపోతాయి.
3. తులసి ఆకు ఒక సహజసిధ్ధమైన మంచి ఔషధం. తులశాకు రసంలో హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి శోభిమచ్చలపై రుద్ది ఆరినతరువాత స్నానం చేస్తుంటే శోభి త్వరగా తగ్గుతుంది.
4. స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా ఉప్పు, నిమ్మ పండు రసం కలిపి స్నానం చేస్తుంటే దురదలు, దద్దుర్లు హరించి శరీరం కాంతివంతంగా మారుతుంది.
5. తులసి, నిమ్మరసం కలిపి నూరి పట్టిస్తుంటే గజ్జి, తామర, దురద, దద్దుర్లు త్వరగా హరించిపోతాయి.
6. తెల్ల గన్నేరు ఆకులు నూరి తెల్ల మచ్చల మీద లేపనం చేయాలి. అతి త్వరగా మచ్చలు పోతాయి.
7. జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దుతూ వుంటే కాలి ఆనెకాయలు హరించిపోతాయి.
8. తేనె 5 గ్రాములు. నెయ్యి 8 గ్రాములు కలిపి పూస్తుంటే తీవ్రమైన వ్రణాలు కూడా తగ్గిపోతాయి.
9. వామును నిప్పులపై వేసి ఆ పొగను వంటికి తగిలే్టట్లు చేస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి.
10. పసుపుపొడి 3 గ్రాములు, ఉసిరిక పొడి 6 గ్రాములు కలిపి మంచినీటీతో సేవిస్తుంటే రక్తశుద్ధి, చర్మశుద్ధి. మారేడు ఆకు ముద్దగా నూరి కడుతుంటే శరీ్రంలో ఇరుక్కున్న ముళ్ళు, మేకులు బయటకొస్తాయి.
11. తెల్లని శోభి మచ్చలతో బాధపడేవారు తులసి ఆకులు, హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి నిద్రించేముందు శోభి మచ్చలపైన పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి.
Post a Comment