నందమూరి బాలకృష్ణ హీరో గా భారి స్తాయిలో చిత్రీకరిస్తున్న లెజెండ్ సినిమా ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తుంది . సింహ వంటి సూపర్ హిట్ కలయికలో వస్తున్నా ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో బాలీవుడ్ హాట్ భామ బిపాషా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే యూనిట్ వర్గాల కథనం ప్రకారం ఈ సినిమాలో మిర్చి భామా అదేనండి హంసా నందిని హాట్ ఐటెం సాంగ్ చేస్తుందని సమాచారం . ఈ ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ పాటను ఈ వారంలోనే తెరకెక్కించనున్నారు. ఈ మద్య ఐటెం సాంగ్ లో తనదైన ముద్ర వేస్తుకున్న ఈ హాట్ భామ తోనే ఈ సాంగ్ చేయించాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారని సమాచారం ? ఈ వార్తను బట్టి చూస్తుంటే బాలీవుడ్ భామ బిపాషా ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడం లేదని తెలిసిపోతుంది?

Post a Comment

 
Top