లెజెండ్ సినిమా చూడటం జరిగింది, రివ్యూ లేక విశ్లేషణ కోసం పది రోజులు వెయిట్ చెయ్యాల్సిన పని లేకుండా వెరైటీ గా ఏమైనా ట్రై చేద్దాం అనిపించి, మా గురువు గారి స్టైల్ లో అయన కాన్సెప్ట్ లో రాయటం జరిగింది, ఎవరిని నొప్పించటానికి చేసిన ప్రయత్నం అయితే ఖచ్చితం గా కాదు, ఒక వేల నొచ్చుకుంటే కొంచెం పెద్ద మనసుతో క్షమించండి. 
సినిమా చేద్దాం అని డిసైడ్ అయ్యాక, కాస్టింగ్ అండ్ బేసిక్ స్క్రిప్ట్ వర్క్స్ ఐపోయాక సెట్స్ పైకి వెళ్లేముందు దర్శకుడి కి తన క్లోజ్ అసోసియేట్ (భజన బృందం సభ్యుడు) కి మద్య సంబాషణ 
దర్శకుడు: బాలయ్య బాబు తో చెయ్యాలి సినిమా
అసోసియేట్: మీ కాంబినేషన్ అంటే సింహ కి తక్కువ లేకుండా అంచనాలు ఉంటై సర్ 
దర్శకుడు; హిస్టరీ అలాంటిది మరి, మళ్లీ మా కాంబినేషన్ అంటే అది రిపీట్ అవ్వాల్సిందే, వెన్ ఐ ఎంటర్ - హిస్టరీ రిపీట్.. ఇదే ఇంటర్వెల్ డైలాగ్ 
అసోసియేట్: హోరిబుల్ సర్.. మీరు ఎంటర్ అవ్వాల్సిందే
దర్శకుడు: ఎంటర్ అయ్యేది నేను కాదయ్యా - బాలయ్య 
అసోసియేట్: అసలేంటి సర్ ఆ మ్యూజిక్ సెన్స్ ఏంటి సర్.. ఆ ఫ్లో ఏంటి సర్ 
దర్శకుడు: కథ విషయానికి వద్దాం, నేను పంపిన డ్రాఫ్ట్ చదివావ
అసోసియేట్: అద్బుతం గా వచ్చింది సర్, కాస్టింగ్ డీటెయిల్స్ కూడా చూసా, తీయబోయే రెండు మూడు సినిమాల కాస్టింగ్ ప్లాన్ ఇప్పుడే చేసేసారు గా 
దర్శకుడు: వాళ్ళంతా ఈ సినిమా కే
అసోసియేట్: ఏంటి 1500 మంది? 
దర్శకుడు: గుద్దు కి 5 చెప్పున లేపబోతున్నా 
అసోసియేట్: మైండ్ బ్లోయింగ్ సర్..ఒక టీ తాగి వస్తా 
దర్శకుడు: ఇంకా మొదలు పెట్టనే లేదు .. అప్పుడే.. 
అసోసియేట్: ఎప్పుడో గంట ముందు భోజనం చేశా సర్.. కొంచెం ఎనర్జీ అవసరం అనిపిస్తుంది.. అందుకే.. స్మాల్ బ్రేక్ 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
దర్శకుడు: ఇక్కడ కూడా ఇద్దరు బాలయ్య లు .. అభిమానులకి పండగే.. అక్కడ అయితే తండ్రి కొడుకు ఇక్కడ కొత్తగా బ్రదర్స్ 
అసోసియేట్: కవల పిల్లలా సర్? ట్విన్స్?
దర్శకుడు: ఎం? కవలలు కాకా పోతే ఒకలా ఉండకూడదా? చెప్పానుగా కొత్తగా అని.. 
అసోసియేట్: అలా అని కాదు సర్, చిన్నప్పటి పెద్ద బాలయ్య పెద్దయ్యాక, ఇంకో చిన్న బాలయ్య కోసం వేరే పిల్లాడిని వాడుతున్నారు కదా, కాస్టింగ్ వేస్ట్, చిన్నప్పుడు ఒకలా లేరు కానీ పెద్దయ్యాక ఒకేలా ఎలా ఉన్నారు అనుకోకూడదు కదా.. 
దర్శకుడు: ఎహె ఇలాంటి చిన్న ఖర్చుల గురుంచి ఆలోచించకు, ప్రొడ్యూసర్స్ 14 రీల్స్ 
అసోసియేట్: (ఓహో కాస్టింగ్ వేస్ట్ అనేది ఒకటే అర్ధం అయ్యిందా).. అరాచకం సర్ ... అరాచకం.. 
దర్శకుడు: కట్ చేస్తే... "వైజాగ్ ఎదుగుతున్న కాలం".. పోలా? అడిరిపోలా?
అసోసియేట్: సబ్జెక్టు పరం గా వైజాగ్ లో ఫోన్స్ లేని కాలం అనో, సిస్టం సంక నాకిపోయిన రోజులు అనో, వైజాగ్ అంటే రాయలసీమ లో వేరే వైజాగ్ లేదు, మన ఉత్తరాంధ్ర లో ఉన్న వైజాగ్ ఏ అని అంటే ఇంకా బావుంటుంది కదా సర్.. 
దర్శకుడు: అంత చదవటానికి ఓపిక ఎవరికీ ఉంటుందయ్యా.. వైజాగ్ స్టొరీ అయ్యే సరికి పేర్లు పడిపోయి, దుబాయ్ లో కట్ చేస్తా.. 
అసోసియేట్: లండన్ అన్నట్టు ఉన్నారు ఎక్కడో డైలాగ్ లో.. 
దర్శకుడు: హైడ్ లో చదువుకొని చెన్నై లో జాబు చెయ్యకుదదా? బ్లాడి ఫూల్.. 
అసోసియేట్: పొరపాటు అయిపొయింది సర్... మన సింహ లో ఆసిడ్ దాడుల గురుంచి సీన్ సూపర్ సర్.. సమాజం పై మీకు ఉన్న కేర్ మీతో అలా రాయిన్చిందా? ఇక్కడ కూడా అలాంటిదే ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నారు.. ఎలా వస్తాయి సర్ మీకు ఈ ఐడియా లు? 
దర్శకుడు: మొన్నామధ్య దుభాయి వెళ్ళినప్పుడు టాయిలెట్ అర్జెంటు గా వస్తే, రెస్ట్ రూం కి వెళ్ళిన నాకు, మోసపోయిన ఒక బాత్రూం కడిగే తెలుగు సోదరుడి కథ బాగా కదిలించేసింది అయ్యా, దుబాయి లో జరుగుతున్న అన్యాయం ని, బాలయ్య ఎదిరించేలా, ఎడారి లో ఫైట్ పెట్టా, ఆ సీన్ తీసే వరకు నిద్ర పోలేదు అసలు..
అసోసియేట్: ఎడారి లో ఫైట్ అంటున్నారు.. ఆ ఇసుక, ఆ ఎండా.. ఆ వేడి.. బాబు కి కష్టం అవ్వుద్ది ఏమో సర్.. 
దర్శకుడు: అందుకే గా జెర్కిన్ వేస్తున్నాం, ఎంట్రన్స్ లో వేసుకోబోయే జెర్కిన్ లండన్ లో కొన్నదే
అసోసియేట్: (ఎడారి ఎండా లో ఎంట్రన్స్ జెర్కిన్ లో ) అద్బుతం సర్.. ఫైట్ అయ్యాక పాట ఎలాగు ఉంటుంది కానీ, మన సింహ లో సాంగ్స్ కి బాలయ్య డాన్సు చేస్తుంటే ఆ రెస్పాన్స్ అద్దిరింది సర్.. మద్య లో దమ్ము సాంగ్స్ తేలిపోయాయి, మరి ఈ సారి ఎం చెయ్యబోతున్నారు?
దర్శకుడు: డాన్సు విషయం లో బాబు కి ముందే చెప్పా, ఇది కామెడీ కి పెద్దగ స్కోప్ లేని సబ్జెక్టు, బ్రాహ్మి గారు ఉన్నా ఆయనకి ఎం రాయలేక పోతున్నాం, జనాల్ని ఎంటర్టైన్ చెయ్యాల్సిన భాద్యత మీదే అని.. 
అసోసియేట్: ఏమన్నారు సర్ బాబు 
దర్శకుడు: వినా కష్టే సినిమా నాస్తి, వినా కష్టే ఫలితం నాస్తి, వినా కష్టే అధరనే నాస్తి అన్నారు... చప్పట్లు కొట్టేసి ఏడ్చుకుంటూ వచ్చేసా.. 
అసోసియేట్: అంటే అర్ధం ఏంటి సర్.. 
దర్శకుడు: అన్నింటికీ అర్ధం అడగకూడదు .. ఎమోషన్ ని అర్ధం చేసుకోవాలి.. మనకి ఎమోషన్ ఉంటె చాలు 
అసోసియేట్: మరి కథ అవసరం లేదా సర్?
దర్శకుడు: హలో... హలో... బాబు.. పెద్ద గెటప్ ఆ బాబు... నేచురల్ గా వదిలేద్దామ బాబు.. రంగు కూడా వద్దా బాబు... విగ్ మాత్రం మస్ట్ అంటారా బాబు.. అలాగే బాబు.. నేను కెమెరా కిందనే సెట్ చేసేస్తా బాబు (ఫోన్ లో )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అసోసియేట్:సర్ ఫస్ట్ హాఫ్ లో 
దర్శకుడు: మూడు పాటలయ్య, దేవి ఇరగేస్తడు
అసోసియేట్: అది కాదు సర్.. ఫస్ట్ హాఫ్ లో ఆ 
దర్శకుడు: నాలుగు ఫైట్ లు, ఒక రెండు మూడు వందల మందికి నరికేస్తాం
అసోసియేట్: అంటే సర్ నేను అనేది . ఫస్ట్ హాఫ్ లో ఆ సీన్ లో 
దర్శకుడు: ఏంటయ్యా నస.. పాయింట్ కి రా.. (పేపర్ పై రాసుకుంటూ)
అసోసియేట్: ఏంటి సర్ ఇది 
దర్శకుడు: డైలాగ్ బావుంది కదయ్యా, పెట్టేస్త సినిమా లో.. సెకండ్ హాఫ్ లో
అసోసియేట్: టైమింగ్ అంటే మీదే సర్.. ఆ ఫస్ట్ హాఫ్ లో అసలు ఈ సీన్ 
దర్శకుడు: మాటాడితే ఫస్ట్ హాఫ్ అంటావెన్తయ్య, ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లో కదా 
అసోసియేట్: నేను మొత్తం సినిమా గురుంచి చెప్తున్నా సర్ 
దర్శకుడు: నేను కూడా చెప్పేది అదే ... ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లో 
అసోసియేట్: మొత్తం సినిమా 
దర్శకుడు: ఫ్లాష్ బ్యాక్ 
అసోసియేట్: అర్ధం అయ్యింది సర్, ఇంతకి బామ్మా గారి ప్లేస్ లో ఎవరు సర్ ఆవిడ.. పేరు ఎక్కడ వినలేదు
దర్శకుడు: శ్రీదేవి గారి   
అసోసియేట్: ఏంటి మన శ్రీదేవి గారి తాలుక న 
దర్శకుడు: నేను చెప్పాలి అనుకున్నది మద్య లో ఆపితే నాకు టెంపర్ లేసుద్ది (పేపర్ పై రాసుకుంటూ).... ఆవిడ సినిమా లో వేసిన ఈవిడ.. మనకి నలిపేసే పెర్ఫార్మన్స్ ఇచ్చే ఆవిడ కావాలి అని ఏరి కోరి సెలెక్ట్ చేశా.. రేపు రిలీజ్ అయ్యాక నలిపెయ్యటం ఖాయం
అసోసియేట్: ఎవర్ని సర్
దర్శకుడు: ఎమోషనల్ సీన్స్ ని అయ్యా
అసోసియేట్: సర్ మీరు నన్ను ఇలా అయ్యా అని పిలుస్తుంటే, మీకు న మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది సర్.. ఐ యాం బ్లెస్సెడ్ సర్ 
దర్శకుడు; (ఫోన్ లో ) హలో.. రత్నం గారు.. లెజెండ్ బాబు హీరోయిన్ ని బుజ్జి .. బుజ్జి అనటం ఓల్డ్ సర్.. కొత్తగా "అమ్మ" అంటాడు.. పిలుపు లో నే ప్రేమ కనిపించటం లా ? ఇది ఫిక్స్ అయిపోండి.. 
అసోసియేట్: మోరల్ లెస్ సర్... మోరల్ లెస్... (కూలోడు యజమాని ని పిలిచినట్టు అయ్యా అనే పిలుపు ఉంటె.. తండ్రి తన కూతుర్ని పిలిచినట్టు అమ్మ అని హీరో మన హీరోయిన్ ని పిలుస్తాడ.. అర్జెంటు గా నాకో బ్రేక్ కావాలి..)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అసోసియేట్: ఏంటి సర్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు 
దర్శకుడు: ఇంటర్వెల్ ముందు ఫైట్ డిజైన్ చేస్తున్నా..
అసోసియేట్: ఈ మద్య 300 పార్ట్ 2 లో ఫైట్లు అదిరిపోయాయి చూసారా సర్?
దర్శకుడు: (న దగ్గర ఉన్నది ఫస్ట్ పార్ట్ ఆ సెకండ్ పార్ట్ ఆ).. మనకేందుకయ్య.. సొంతం గా ఆలోచించలేని వాడికి కావాలి మగధీర లు, 300 లు.. మనం అవి చూడం, మన అంతట మనం తీస్తాం, మనం తీసింది జనాలు చూడాలి కానీ.. 
ఏదో చెప్పబోతు ఉండగా అసోసియేట్ ఫోన్ మోగింది... చత్రపతి లో .. "ఇంకా చాలు" కాలర్ ట్యూన్ లో.. కొంచెం సేపు మౌనం.. 
అసోసియేట్: సర్ మన సినిమా లో 
దర్శకుడు: ఎన్ని సార్లు చెప్పాలయ్య .. ఫ్లాష్ బ్యాక్ లో.. 
అసోసియేట్: సినిమా మొత్తం రాసుకున్నారు కదా సర్ 
దర్శకుడు: ఫ్లాష్ బ్యాక్ గట్టిగా రాసుకున్నా
అసోసియేట్; అనవసరం గా గంట వేస్ట్ చేసుకున్నాం సర్.. బాలయ్య ఎంట్రన్స్ ఎలా ఉండబోతుంది సర్
దర్శకుడు: లెజెండ్ బైక్.. గుర్రం.. బీచ్ రోడ్... నరుకుడు.. చంపుడు.. 
అసోసియేట్; కేక సర్.. సరే పాయింట్ కి వచ్చేద్దాం.. ఫ్లాష్ బ్యాక్ లో జగపతి బాబు ఎదిగే వరకు లెజెండ్ ఎందుకు ఖాలీ గా ఊరుకునట్టు.. తన పేరెంట్స్ ని చంపిన వాళ్ళని తిరిగి చంపకుండా.. 
దర్శకుడు: ఫస్ట్ టైం జగపతి బాబు ని సెంటర్ లో కలిసినప్పుడు.. "నీకు తిక్క రేగాలేమో.. నాకు 24 గంటలు ON లో నే ఉంటుంది" అని డైలాగ్ కి రేపు థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో ఊహించుకుంటే త్రిల్ గా ఉందయ్యా 
అసోసియేట్; (ఆన్సర్ మాత్రం చెప్పలేదు గా)  అంత దూరం ఎందుకు తీసుకు రావటం.. అసలు ముందే ఆపేసి ఉండాల్సింది కదా అని.. 
దర్శకుడు: ఎంట్రన్స్ కి ఈ సీన్ మద్య లో టైటిల్ సాంగ్ లో స్లో మోషన్ లో బాలయ్య నడుస్తుంటే.. మెట్లు మీద నుంచి పక్కన సింహాలు నడుస్తూ... 
అసోసియేట్; సింహాలు పెంచుకుంటాడ సర్ 
దర్శకుడు: బాగా ఎక్కువైంది కదా.. సింహాలు లాంటి కుక్కల్ని పెడదాం.. 
అసోసియేట్: (టాపిక్ బాగానే సైడ్ ఎసారు).. సర్ ఇంతకి లెజెండ్ ఎం చేస్తూ ఉంటాడు.. ఒక్క లైన్ లో.. 
దర్శకుడు: రాత్రుళ్ళు మందు కొడతాడు.. పగలు మందిని కొడతాడు.. ఏడుస్తాడు.. నవ్వుతాడు.. కోపం లో ఊగిపోతడు.. సిస్టం గురుంచి ఆలోచిస్తాడు.. ఫమిల్య్ కోసం ప్రాణం ఇస్తాడు.. ఒకే ఒక్క సారి గోడ దూకుతాడు.. జాలి లో ... 
అసోసియేట్ ఫోన్ మోగింది.. మౌనం.. రింగ్ టోన్ చెప్పక్కర లేదు అనుకుంట.. 
దర్శకుడు: నీ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవయ్య
అసోసియేట్: సారీ సర్.. ఆ MP తో సీన్ లో పిట్ట కథ సూపర్ సర్.. కానీ ఆ తర్వాత.. నాకు ఎదురొచ్చిన.. నేను ఎదురేల్లినా అన్నారు.. కానీ అది ఎదురు వెల్లటమా లేక వెనక వెల్లటమా.. 
దర్శకుడు: అసలు ఆ సీన్ లో బాబు పేస్ కి కెమెరా జూమ్ చేసి.. సింహ లో పవర్ఫుల్ గా చెప్పిన ఎమోషన్ లో చెప్పిస్తే.. అసలు థియేటర్ లో సీట్ లో ఎవడు కుర్చోడు గా.. 
అసోసియేట్: (నేను అడిగింది ఏంటి.. మేరు చెప్తుంది ఏంటి నటరాజ) బ్రిలియంట్ సర్... ఆ సిస్టర్ సెంటిమెంట్ కూడా... చాల సినిమాల్లో వచ్చిన ప్రాబ్లం ఏ కదండీ.. ఆడపిల్ల.. అబార్షన్.. 
దర్శకుడు: ఇది కూడా క్లోజ్ అప్ అయితే బోర్ కొట్టేసుద్ది ఏమో.. సైడ్ ఆంగిల్ ట్రై చెయ్యాలి.. కెమెరా ని ఒక పక్కగా తిప్పి బూమ్ అంటే పగిలిపొడ్డి.. (ఇంతలో రత్నం నుంచి ఫోన్)
                   దర్శకుడు: చెప్పండి రత్నం గారు 
                   రత్నం: మొన్న బాబు చెప్పిన డైలాగ్ కి అర్ధం దొరికింది సర్ 
                   దర్శకుడు: అవునా.. నాకు అలాంటిది ఒకటి కావాలి .. 
                   రత్నం: నాకు అర్ధం కావటానికే చాల టైం పట్టింది సర్ 
                   దర్శకుడు: పర్లేదు అర్ధం కూడా బాబు తోనే చెప్పిద్దాం
                   రత్నం: అప్పుడు అసలు అర్ధం ఒక్కటే చెప్పిస్తే సరిపోద్ది గా 
                   దర్శకుడు: ఓన్లీ అర్ధం కి విజిల్ లు పడవ్.. ఒరిజినల్ ఏ కావాలి 
                 రత్నం: ఓకే ఓకే .. (ఎందుకొచ్చిన గోల.. అక్కడక్కడ రాసుకున్నా ఇంగ్లీష్ డైలాగ్ లు కూడా తెలుగులో చెప్పించేస్తే పోలా)
అసోసియేట్: ఈ టైమింగ్ మాత్రం అద్బుతం సర్.. సర్ మరి మన సినిమా లో .. అదే ఫ్లాష్ బ్యాక్ లో హింస ఎక్కువైంది గా
దర్శకుడు: అందుకే గా.. మామ్మ గారు నలిపేసే సీన్స్ రాసుకున్నది.. సెంటిమెంట్ తో.. ఆ నటన కి.. కంట తడి పెట్టని ప్రేక్షకుడు ఉండదు .. 
అసోసియేట్: సెంటిమెంట్ కా.. నటన కా సర్ 
దర్శకుడు: నీది లాటరి.. నాది హిస్టరీ .. డైలాగ్ ఎలా ఉంది ... 
అసోసియేట్:  (ఈయన సమాధానం ఎప్పుడు చెప్పాలి) ఆ బుక్ ఇలా ఇవ్వండి సర్.. రాసి పెడతాను.. 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అసోసియేట్:  సర్ క్లైమాక్స్ లో 
దర్శకుడు: ఫ్లాష్ బ్యాక్ లో డౌట్స్ ఎం లేవు గా 
అసోసియేట్: (అడిగిన దానికి ఒక్క దానికి సమాధానం ఉంటె గా).. ఫ్లాష్ బ్యాక్ సూపర్ సర్.. క్లైమాక్స్ లో 
దర్శకుడు: సరే మరి.. ఫ్లాష్ బ్యాక్ ఓకే గా.. ఇంకేంటి కబుర్లు.. 
అసోసియేట్: చిన్న బాలయ్య థ్రెడ్ క్లోజ్ చెయ్యలేదు ఏమో కదండీ 
దర్శకుడు: ఫ్లాష్ బ్యాక్ లో చిన్న బాలయ్య ఉండదు గా 
అసోసియేట్: సర్.. మనం ఫ్లాష్ బ్యాక్ వదిలేసి క్లైమాక్స్ కి వచ్చేసాం
దర్శకుడు: ఓహ్.. అయితే ఫస్ట్ నుంచి ఎం రాసామో ఒకసారి గుర్తు చేయి.. అదేనయ్యా ఫస్ట్ హాఫ్ లో ఎం రాసుకున్నాం అని.. 
అసోసియేట్; అంటే అది.. జగపతి బాబు CM గా.. చిన్న బాలయ్య పై ఎటాక్.. అక్కడ పెద్ద బాలయ్య ఎంట్రీ.. కానీ క్లైమాక్స్ పేజెస్ ఏంటి సర్ ఖాలీ గా ఉన్నాయి..  
దర్శకుడు: ఓకే ఓకే .. (ఫోన్ లో .. ఇందాక చెప్పటం మర్చిపోయాను.. పొలిటికల్ బేస్డ్ మూవీ కదా.. బాబు కి జగపతి బాబు కి వైట్ డ్రెస్ లు కుట్టించండి.. వైట్ అండ్ వైట్ ఒక్కో జత చాలు..).. చిన్న బాలయ్య కి ఎం కాదు అని చెప్పించేద్ద్ధం.. క్లైమాక్స్ కి ఇంకా టైం ఉంది లే.. 2014 ఎలక్షన్స్ టైం లో పొలిటికల్ పోసిషన్ ఎలా ఉందొ చూసుకొని రాసుకుందాం.. తొందర ఏముంది..  ఫ్లాష్ బ్యాక్ లో ఎం డౌట్స్ లేవుగా..
అసోసియేట్: ఫ్లాష్ బ్యాక్ ఓకే కానీ.. క్లైమాక్స్ ఏ అర్ధం కాలేదు.. 
దర్శకుడు: అప్పటికి జగన్ సీన్ ఏంటో, కాంగ్రెస్ సీన్ ఏంటో.. చూసుకొని.. మన పార్టీ కి వచ్చే వాళ్ళని హర్ట్ చెయ్యకుండా రాసుకుందాం.. అవన్నీ ఇప్పుడే ఎలా చెప్పగలం.. ఆ టైం లో దగ్గర చేసి రాసుకుంటే నే కదా బావుండేది.. 
అసోసియేట్: (ఒక్క ప్రశ్న కి ఆన్సర్ దొరికింది అన్నమాట).. "పెంటా"స్టిక్ సర్... పెంటాస్టిక్.. సర్ చివరిగా ఒక మాట. ఖచ్చితం గా ఈ హింసాత్మక సబ్జెక్టు కి వైజాగ్ ఉండాలి అంటారా.. 
దర్శకుడు; సమరసింహా రెడ్డి.. నరసింహ నాయుడు.. సింహ... వైజాగ్ లో షూటింగ్ చేస్తే సినిమా కి తిరుగు ఉండదు.. వెన్ హి ఎంటర్ వైజాగ్ .. హిస్టరీ రిపీట్
అసోసియేట్: సర్... ఇంకా మేరు చెప్పాల్సిన టైం వచ్చేసింది సర్... మా కోసం ఒక్క సారి చెప్పండి 
దర్శకుడు; "రెడీ బాబు... కెమెరా..... ఆక్షన్" తనదైన స్టైల్ లో పిడికిలి విప్పుతూ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సినిమా రిలీజ్ అయిన రోజు.. 
దర్శకుడు; ఏమయ్యా.. సినిమా ఎలా ఉంది అంటున్నారు జనాలు 
అసోసియేట్: ఫ్లాష్ బ్యాక్ బావుంది అంటున్నారు సర్ 
దర్శకుడు; నేను చెప్పను గా.. హిస్టరీ రిపీట్ అని.. 
అసోసియేట్: ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అండ్ క్లైమాక్స్ వీక్ అంటున్నారు సర్ 
దర్శకుడు; ఫ్లాష్ బ్యాక్ గురుంచి కంప్లైంట్స్ ఎం లేవు గా ... హిస్టరీ రిపీట్ .... 
అసోసియేట్: ఓవరాల్ గా ఓకే అని 
దర్శకుడు; మరి ఫ్లాష్ బ్యాక్ 
అసోసియేట్: ఫ్లాష్ బ్యాక్ కి రెస్పాన్స్ బావుంది సర్ 
దర్శకుడు; నేను చెప్పను గా.. హిస్టరీ రిపీట్ అని.. 
మన గణేష్ రావూరి గారి కృష్ణానగర్ కథలు కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని డెవలప్ చేసుకున్నది.. ప్రేరనే తప్ప అనుకరణ కాదని నమ్ముతూ.. సభా ముఖం గా ఆయనకి కృతజ్ఞతలు
మీ
హరి కృష్ణ రాజు

Post a Comment

 
Top