తెలుగులో సంజయ్‌దత్ మేనకోడలు
ఆలులేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు వుంది ‘ఆషికి 2’సినిమా పరిస్థితి. ఈ చిత్రం సెట్స్‌పైకి ఎఫ్పుడు వెళ్తుందో తెలీదుగానీ రోజుకో హీరోయిన్ తెరపైకి వస్తోంది. తాజాగా సంజయ్‌దత్ మేనకోడలుని హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘ఆషికి 2’. నిర్మాతకు కోట్లాది రూపాయలను తెచ్చిపెట్టింది ఈ సినిమా. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని బండ్లగణేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హీరోగా సచిన్ నటిస్తున్నాడు. ఈ హీరో సరసన చాలామంది హీరోయిన్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. కాజల్, తమన్నా, మాజీ మిస్ఇండియా అంకితా షోరే... ఇప్పుడేమో సంజయ్‌దత్ మేనకోడలు నాజియా హుస్సేన్ పేరు వచ్చింది. హిందీలో Yeh Jo Mohabbat hai,say yes to love వంటి చిత్రాల్లో నటించిన అనుభవం ఈమె సొంతం. అంతేకాదు బాలీవుడ్ హీరో సంజయ్‌దత్‌కి మేనకోడలు. తెలుగులో ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఆడిషన్ టెస్ట్‌లో పాసై సెలక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా వుందని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ చెప్పేసింది. ఏమో మిగతా హీరోయిన్ల మాదిరిగా కొత్త బ్యూటీ వస్తుందేమోనని డౌట్ అప్పుడే ఈమెని వెంటాడుతుందన్నమాట.
Tags : Ap cinema, tollywood news, tollywood gossips, ankita shorey heroine, ankita shorey miss india, ankita shorey offer telugu movie, Nazia Hussain heroine, Nazia Hussain latest stills, Nazia Hussain hot, Nazia Hussain latest movie, Nazia Hussain bumper offer, Nazia Hussain in telugu movie, nazia hussain niece of sanjaydutt
Post a Comment