హీరోయిన్ శ్రుతి హసన్ కి ఇప్పుడో గొప్ప అవకాశం లభించింది. మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకేక్కబోతుంది. కథ పూర్తి కావడంతో దర్శకుడు నటీనటుల ఎంపికలో నిమగ్నమయ్యాడు. మహేష్ బాబు సరసన శ్రుతి హసన్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. వెంటనే డేట్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆగడు సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకేక్కనున్నది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో మహేష్ , నాగార్జున కలసి నటిస్తున్న సినిమాలో మహేష్ సరసన శ్రుతి నటిస్తున్నది. మొత్తమీద మహేష్ బాబుతో వరుసగా రెండు సినిమాల్లో నటిస్తోందన్నమాట. ఇటీవలే ఈ అమ్మడు నటించిన రేసుగుర్రం విడుదలై విజయపధంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం కోలీవుడ్ , బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నది శ్రుతిహాసన్ .

Post a Comment

 
Top