తన జిమ్ కు రోజూ వ్యాయామానికి వస్తున్న ఓ యువతి పై కన్నేసిన జిమ్ ట్రైనర్ ఆ యువతికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి  అత్యాచారం చేశాడు. ఈ సంఘటన  దక్షిణ ఢిల్లీలోని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దాంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘోరం చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు  జిమ్ ట్రైనర్ తరుణ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు సరోజిని నగర్ పోలీసులు వెల్లడించారు. బాధితురాలు (30) స్థానికంగా వ్యాపారం చేసుకుంటు జీవిస్తోంది . కొద్ది నెలల క్రితం ఆమె జిమ్ లో చేరటంతోఆమెకు జిమ్ ట్రైనర్ తరుణ్ శిక్షణ ఇస్తున్నాడు. ట్రైనింగ్ ఇస్తూ ఆమెపై వ్యామోహం తో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమె మగతలో ఉండగా తన పని కానిచ్చేసాడు . మెలుకువ వచ్చిన తర్వాత అతడిని సదరు మహిళ నిలదీయడంతో ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి . ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Post a Comment

 
Top