నయనతార బాటలోనే ఈ బ్యూటీ

నయనతార బాటలోనే ఈ బ్యూటీ
శింబు నుంచి విడిపోయాక నయనతార ఎలాగైతే బిజీ అయ్యందో... హన్సిక కూడా అదే దారిలో వెళ్తోంది. తాజాగా కోలీవుడ్ తీరికలేకుండా బిజీగావున్న హన్సిక న్యూప్రాజెక్ట్‌‌కు కమిట్ అయ్యింది. విక్రమ్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. తెలుగులో నాగచైతన్య సరసన ‘దుర్గ’, హీరో రామ్‌తో ‘పండగ చేస్కో’సినిమాల్లో నటిస్తోంది. ఇవికాకుండా కోలీవుడ్‌లో మరో మూడు ప్రాజెక్టులున్నాయి. ధరణి డైరెక్షన్‌లో విక్రమ్ ఓ సినిమా చేస్తున్నాడు. విక్రమ్ సరసన ఎవరిని హీరోయిన్‌గా తీసుకోవాలా అన్నదానిపై ఆలోచించి చివరకు హన్సిక వైపు దర్శకుడు మొగ్గుచూపాడు. చాలామంది హీరోయిన్లు పోటీపడినప్పటికీ హన్సిక తమిళంలోవున్న క్రేజ్‌ను దృష్టిలోపెట్టుకుని ఓకే చేసినట్లు కోలీవుడ్ టాక్. మొత్తానికి తమిళతంబీలకు బాగానే దగ్గరవుతోంది. గతంలో శింబు నుంచి విడిపోయాక నయనతారకూ ఇలాగే ఆఫర్లు మీద ఆఫర్లు వచ్చిపడ్డాయి. నయన బాటలోనే హన్సిక నడుస్తోందని తమిళతంబీలు అనుకుంటున్నారు.





Tags : cinema,kollywood news, kollywood gossips, Hansika sign another movie in kollywood, Hansika hot, hansika with vikram movie, hansika latest movie, dharani director

Post a Comment

 
Top