ఈ జెనరేషన్లో మగవారికి శరీర ధారుఢ్యం పైనే కాదు వారి అందం మీద కూడా శ్రధ్ధ పెరుగుతోంది. ప్రతి వారూ తామూ.. అందంగా ఉండాలని ఈ రోజుల్లో పార్లర్లకు పరిగెడుతున్నారు.కాబట్టి అటువంటి వారి కోసం తప్పకుండా కొన్ని బ్యూటీ టిప్స్ అవసరం.
సాధారణంగా చాలా మంది మగవారి చర్మం ఆయిల్ చర్మం కలిగి, జిడ్డుగా ఉంటుంది. అలాగే వారి ముఖంలో ఓపెన్ రంధ్రాలు కలిగి ఉంటాయి. మగవారు ఎక్కువ బయట తిరుగుతుంటారు కాబట్టి దుమ్ము, ధూళి ముఖ రంధ్రాల్లో చేరి ముఖంలో మొటిమలు, ముడతలు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి మగవారి ముఖాన్నిశుభ్రపరుచుకోవడానికి కెమికల్ ఫ్రీ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం మంచిది. ప్రతి రోజూ ఇంటికి తిరిగి రాగానే ముఖాన్ని మంచినీళ్ళతో శుభ్ర పరచుకొని క్లెన్సింగ్ అప్లై చేయడం చాలా మంచిది. పురుషులకు ఉపయోగపడే ఫేస్ ఫేషియల్స్:
1. రోజుకు కనీసం మూడు సార్లైన ఫేస్ వాష్ క్రీమ్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
2. అతి తక్కువ రసాయనాలు కలిగిన ఫేస్ వాష్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
3. సోపు ఉత్పత్తులకు సంబంధించిన లేదా డియోడరెంట్స్ కు సంబంధించిన ఉత్పత్తులను ముఖానికి వాడకూడదు.
4. షేవింగ్ చేసిన తర్వాత అలోవెరా ఫేష్ వాష్ చేసుకొంటే షేవింగ్ సమయంలో చిన్న గాట్లు ఏర్పడ్డా ఏటువంటి మార్క్స్ లేకుండా చేస్తుంది.
5. ముఖ్యంగా పురుషు చర్మం రఫ్ గా ఉంటుంది కాబట్టి అందుకోసం విటమిన్ ఇ ప్రోడక్ట్స్ ను లేదా ఆలోవరా(కలబంద)లతో తయారైనటు వంటి ఫేష్ వాష్ లతో శుభ్రం చేసుకోవాలి.
6. వ్యాజ్ లైన్ ను తరచూ పెదవులకు రాస్తుండాలి.
7. ముఖం మరీ గరుకుగా ఉన్నప్పుడు తప్పని సరిగాపార్లర్ కి వెళ్ళి ఒకటి రెండు సార్లు వారి సలహాలను, పద్దతులను పాటించాలి.
8. చిన్ని చిన్న జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ముఖంలో మొటిమలు, ముడతలు, రంద్రాలు పోగొట్టి ముఖ చర్మాన్ని ఆకర్షనీయంగా ఉంచుతుంది.
Post a Comment